
ఆరోగ్యం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే నేడు, రేపు కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ అమల్లో ఉండనుంది. మరో రెండు రోజుల పాటు తీవ్ర ఎండలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!