

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుక సిద్ధమవుతోంది. మహేష్ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘పోకిరి’ సినిమాను మరోసారి రీ-రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈసారి రీ-రిలీజ్ సందర్భంగా తొలిసారిగా ప్రత్యేక మిడ్‌నైట్ షోలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు మరోసారి థియేటర్లలో ‘పోకిరి’ మ్యాజిక్‌ను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2006లో విడుదలైన ‘పోకిరి’ టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ఇలియానా నటించారు. ప్రకాశ్ రాజ్, నాజర్, ఆలీ, బ్రహ్మానందం, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, మంజుల ఘట్టమనేని నిర్మించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!