
సినిమాలు

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ గ్రాండ్ విడుదలకు సిద్ధమవుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా ‘జన నాయగన్’ పేరుతో విడుదల కానుంది. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, గంటల వ్యవధిలోనే అద్భుతమైన స్పందన లభించింది. బెంగళూరు వంటి నగరాల్లో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ బుకింగ్స్ జోరుగా సాగుతూ ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండింగ్‌లో నిలిచింది. విజయ్ చివరి చిత్రంపై అభిమానుల్లో ఉన్న భారీ అంచనాలకు ఈ స్పందనే నిదర్శనంగా నిలుస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!