
ఓటీటీ

ఇండోనేసియాలోని హల్మహెరా ద్వీపంలో ఉన్న డుకోనో అగ్నిపర్వతం నిన్న విస్ఫోటనం చెందింది. ఈ ఘటనలో ముగ్గురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. విస్ఫోటనం సమయంలో అక్కడ 20 మంది పర్వతారోహకులు ఉండగా, వారిలో 14 మందిని సురక్షితంగా రక్షించారు. గాయపడిన ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు సింగపూర్ పౌరులు, ఒకరు ఇండోనేసియా దేశస్థుడు ఉన్నట్లు సమాచారం.
అగ్నిపర్వతం విస్ఫోటనంతో దట్టమైన బూడిద మేఘాలు సుమారు పది కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించాయి. గల్లంతైన వారికోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇండోనేసియా పసిఫిక్ అగ్నివలయంలో ఉండటం వల్ల అక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తుంటాయి. ప్రస్తుతం డుకోనో అగ్నిపర్వతం వద్ద రెండో అత్యున్నత స్థాయి హెచ్చరికలు అమల్లో ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!