

అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం కొత్త చిక్కులు తీసుకొచ్చింది. గ్రీన్‌కార్డు దరఖాస్తులను పరిశీలించే సమయంలో ఇమిగ్రేషన్ అధికారులు పరిగణనలోకి తీసుకునే అంశాల పరిధిని ప్రభుత్వం విస్తరించింది. ‘పబ్లిక్ చార్జ్’ నిబంధన నిర్వచనాన్ని విస్తరిస్తూ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. ప్రభుత్వ వైద్యసాయం, ఆహారం, గృహవసతి, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్న వలసదారుల దరఖాస్తులపై ఇకపై మరింత కఠినంగా పరిశీలన జరగనుంది. USCIS జారీ చేసిన ఈ సవరణ ఫ్రేమ్‌వర్క్ సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానుంది.
అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారిలో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉండటంతో తాజా నిబంధనలు వారిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉందని అధికారులు భావించే దరఖాస్తుదారులు అదనపు పరిశీలనను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చు. దీంతో అమెరికా గ్రీన్‌కార్డు ప్రక్రియ మరింత కఠినంగా మారే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!