
రాజకీయాలు

ఏ. కొండూరు ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. పులి కదలికలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పులి సంచరించే మార్గాలను గుర్తించి, దాని కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
పులి కదలికలను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ఏఐ కెమెరాలను వినియోగించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి రెస్క్యూ బృందాలను రప్పించాలని సూచించారు. అలాగే, హనుమాన్ బృందాలతో ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా గస్తీ నిర్వహించాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!