

నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులపై అభియోగాలను ఖరారు చేసింది. నవంబర్ 25 నుంచి కేసు విచారణ అధికారికంగా ప్రారంభం కానుందని కోర్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించాలనుకునే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ కేసు ఇప్పటికే తీవ్ర చర్చకు దారితీసింది. కోర్టు తాజా ఆదేశాలతో ఈ వ్యవహారం మరో కీలక దశకు చేరుకుంది.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సుమారు 20 వేల పేజీలతో కూడిన భారీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసినట్లు సమాచారం. అయితే, తమపై వచ్చిన ఆరోపణలను 14 మంది నిందితులూ ఖండించారు. విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో సీబీఐ సేకరించిన ఆధారాలు, నిందితుల పాత్రపై కోర్టులో వాదనలు జరగనున్నాయి. నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులతో పాటు దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియపై ఈ కేసు విచారణ ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అందరి దృష్టి కోర్టు తదుపరి చర్యలపై నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!