
జనరల్

అమెరికాలోని ఇడాహో రాష్ట్రంలో నిర్వహించిన ‘గన్‌ఫైటర్ స్కైప్ ఎయిర్ షో’లో రెండు యుద్ధ విమానాలు గాల్లోనే ఢీకొన్న ఘటన కలకలం రేపింది. విన్యాసాల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో విమానాల్లో ఉన్న నలుగురు పైలట్లు పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం అనంతరం విమాన శకలాలు నేలపై పడటంతో భారీగా మంటలు చెలరేగాయి.
ఘటన తర్వాత అధికారులు వెంటనే మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ను మూసివేసి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై అమెరికా వైమానిక దళం దర్యాప్తు ప్రారంభించింది. ఎయిర్ షోను వీక్షిస్తున్న ప్రేక్షకుల్లో ఈ ఘటన భయాందోళనలు కలిగించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!