
జనరల్

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివస్తుండటంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది.
ఈ పరిస్థితుల్లో భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. శ్రీవేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా టికెట్లు జారీ చేయనుంది. ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 21న ఉదయం 10 గంటలకు టికెట్లు విడుదల చేయనున్నారు.
ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. టికెట్ పొందిన భక్తులు మూడు రోజులు జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఆలయ పవిత్రత కోసం ఆగమశాస్త్ర ప్రకారం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!