
బిజినెస్

1991 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ల (ఎస్ఐలు) ఫిర్యాదులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిశీలించడంతో పాటు, ఖాళీగా ఉన్న ఇన్స్పెక్టర్ పోస్టుల సర్దుబాటు అంశాన్ని కూడా కమిటీ సమీక్షించనుంది.
ముఖ్యంగా వరంగల్ రేంజ్లో ఖాళీగా ఉన్న ఇన్స్పెక్టర్ పోస్టుల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా 1991 బ్యాచ్ ఎస్ఐల సమస్యలు, పదోన్నతులు మరియు ఖాళీల సర్దుబాటుకు సంబంధించిన అంశాలపై తెలంగాణ పోలీసు శాఖ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!