
జనరల్

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు టిక్కెట్లు, వసతి గదులు మరియు ఇతర సేవలను బుక్ చేసుకునే సమయంలో టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్. వెంకయ్య చౌదరి సూచించారు. అధికారిక వెబ్‌సైట్‌లోనే దర్శన టిక్కెట్లు, గది బుకింగ్‌లు, సేవలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
కొంతమంది మోసగాళ్లు భక్తుల విశ్వాసాన్ని, ఆధ్యాత్మిక భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారని ఆయన హెచ్చరించారు. అలాంటి నకిలీ వెబ్‌సైట్‌లు లేదా అనుమానాస్పద సమాచారాన్ని గమనిస్తే వెంటనే టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేయాలని భక్తులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!