
జనరల్

పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ నితీశ్ కౌశల్‌ను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అమెరికాలో హత్యలు, కిడ్నాప్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, ఇతర హింసాత్మక నేరాల్లో అతడు ప్రమేయం ఉన్నట్లు ఎఫ్‌బీఐ ఆరోపించింది. పంజాబ్‌కు చెందిన జగ్గు భగవాన్‌పురియా నేతృత్వంలోని నేర ముఠాతో నితీశ్ కౌశల్‌కు సంబంధాలున్నట్లు అధికారులు తెలిపారు.
అమెరికాలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జూన్ 25న నితీశ్ కౌశల్‌పై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఎఫ్‌బీఐ చేపట్టిన ‘ఆపరేషన్ హార్డ్ బాల్’లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా అమెరికా, కెనడా, యూరప్ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భగవాన్‌పురియా ముఠాపై కఠిన చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!