
షోస్

‘డిమాగి నక్సల్ పార్టీ’ పేరుతో ఓ ఇన్స్టాగ్రామ్ పేజీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాక్రోచ్ పీపుల్స్ పార్టీ తరహాలో ఈ పేజీని రూపొందించినట్లు దాని వివరాలను బట్టి తెలుస్తోంది. ‘థింక్ | రీసెర్చ్ | రెసిస్ట్’ అనే నినాదంతో కొనసాగుతున్న ఈ పేజీకి ఇప్పటికే 1.51 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. పేజీ బయోలో పార్టీకి సంబంధించిన పలు వివరాలను నిర్వాహకులు పొందుపరిచారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ‘డిమాగి నక్సల్’ అనే పదాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో, అదే పేరుతో రాజకీయ పేజీ రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ పేజీకి సంబంధించిన వివరాలు, దాని రాజకీయ ఉద్దేశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరుగుతోంది. అయితే ఈ పేజీ అధికారిక రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిందా లేదా అనే విషయంపై స్పష్టత అవసరం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!