

హైదరాబాద్‌లో ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కామన్ పాస్ ప్రయోజనాలను స్వయంగా పరిశీలించేందుకు భట్టి తన బృందంతో కలిసి బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ప్రయాణించారు. మెట్రో, ఆర్టీసీ సేవలను సమన్వయం చేయడం వల్ల ప్రయాణికులకు బదిలీ ప్రయాణం సులభమవుతుందని, మెట్రో స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు మెరుగైన అనుసంధానం లభిస్తుందని తెలిపారు.
మెట్రో ప్రయాణికులకు తొలి, చివరి దశ అనుసంధానంలో ఆర్టీసీ బస్సులు కీలకంగా పనిచేస్తాయని భట్టి విక్రమార్క అన్నారు. భవిష్యత్తులో మెట్రో-ఆర్టీసీ అనుసంధానాన్ని మరింత విస్తరించడంతో పాటు ఆటోలు, యాప్ ఆధారిత క్యాబ్ సేవలను కూడా అనుసంధానించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కామన్ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంటి నుంచి గమ్యస్థానం వరకు సులభమైన ప్రయాణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!