
జనరల్

నీట్ అంశం తర్వాత ఇప్పుడు ఈ20 ఇంధనంపై మరో నిరసనకు ఢిల్లీ వేదిక కానుంది. ఢిల్లీ టాక్సీ, ట్రాన్స్‌పోర్టర్స్ అసోసియేషన్, టూర్ ఆపరేటర్ల సంఘం ఆగస్టు 4న పార్లమెంట్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ అమలును వ్యతిరేకిస్తూ ఈ నిరసన చేపడుతున్నట్లు సంఘాలు వెల్లడించాయి.
E20 ఇంధనం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల రవాణా నిర్వాహకులు, వాహన యజమానులు ఇంధన సామర్థ్యం తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధరలు పెంచి, అదే సమయంలో ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని అందించడం సరైన విధానం కాదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!