

న్యూఢిల్లీలోని భారత మండపంలో బ్రిక్స్ సదస్సు జరుగుతోంది. సదస్సుకు హాజరైన అతిథులు, ప్రతినిధులందరికీ ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. బ్రిక్స్ ఏర్పాటై రెండు దశాబ్దాలు పూర్తైన సందర్భంగా సభ్య దేశాల ప్రజలకు మరింత బలమైన, సుస్థిరమైన భవిష్యత్తుపై భరోసా కల్పించాలని మోదీ అన్నారు. పరస్పర సహకారంతో బ్రిక్స్ దేశాలు అభివృద్ధి సాధించాలని, అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారాలు చూపే దిశగా ముందుకు సాగాలని సూచించారు. మనం వేసే ప్రతి అడుగులో మానవాభివృద్ధికే ప్రాధాన్యం ఉండాలని స్పష్టం చేశారు.
బ్రిక్స్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఏకపక్ష యుద్ధాలకు వ్యతిరేకంగా నిలవడం, చర్చలు మరియు దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, స్వదేశీ కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రపంచ పాలనా వ్యవస్థల్లో సంస్కరణలు చేపట్టడం, ఆర్థిక మరియు వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలకు డిక్లరేషన్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడంలో భారత దౌత్యనీతికి కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!