
ఓటీటీ

కొత్త వాహనాలకు 24 గంటల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీలర్ వద్ద తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలకు సంబంధించి రవాణా అధికారులు నిర్దేశిత గడువులోగా ఆమోదం, తిరస్కరణ లేదా అభ్యంతరాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది.
అయితే నిర్దేశిత సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, ఆ దరఖాస్తు ఆటోమేటిక్‌గా ఆమోదం పొందినట్లుగా (డీమ్డ్ టు అప్రూవల్) పరిగణించబడుతుంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి ఎన్ఐసీతో సమన్వయం చేసి వాహన్ పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేయాలని రవాణాశాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!