

మాతంగి అనురాధ తాజాగా చేసిన భవిష్యవాణిలో ప్రజలు నిర్వహిస్తున్న పూజలపై స్పందించారు. భక్తులు చేస్తున్న పూజలకు సంతోషంగా ఉందని పేర్కొంటూనే.. తాను ఎంత శాంతంగా ఉంటున్నా తనను ఉగ్రరూపంలోకి తీసుకెళ్తున్నారని అన్నారు. అయినప్పటికీ తాను శాంతంగా ఉంటూ అందరినీ కాపాడుతున్నానని, కడుపులో పెట్టుకుని భక్తులను సంరక్షిస్తున్నానని చెప్పారు. ప్రజల పాపాలు పెరిగిపోతున్నాయని, అందుకే ప్రకృతి పరిస్థితుల్లోనూ అనేక మార్పులు కనిపిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.
ఒకచోట వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మరోచోట వర్షాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాతంగి అనురాధ పేర్కొన్నారు. కలికాలంలో జరగరానివి జరుగుతున్నాయని, మంచి వారికి మంచి, చెడ్డవారికి చెడు జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!