

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా విశాఖపట్నం, హైదరాబాద్ సహా ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ కార్యాలయంతో పాటు సంస్థ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టింది. పలు ఎఫ్‌ఐఆర్‌లు, చార్జ్‌షీట్ల ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
సోదాల్లో రూ.1.01 కోట్ల నగదుతో పాటు ఆస్తులకు సంబంధించిన పత్రాలు, కీలకమైన డిజిటల్ పరికరాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. సంస్థకు చెందిన 182 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో పాటు ఆరు ఖరీదైన లగ్జరీ వాహనాలపై ఫ్రీజింగ్ ఆదేశాలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో సంస్థ రూ.2,000 కోట్లకు పైగా నిధులను సమీకరించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. నిధుల ప్రవాహం, ఆస్తులు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఈడీ పరిశీలిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!