
క్రీడలు

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్న నేపథ్యంలో ధాన్యం రవాణాకు అవసరమైన లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంచాలని రవాణా శాఖ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములు, రైస్ మిల్లులకు ధాన్యాన్ని సకాలంలో తరలించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ధాన్యం తరలింపు విషయంలో జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. రవాణా వాహనాలన్నింటికీ ఆర్సీ, ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పీయూసీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. రవాణా సమయంలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించి, ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!