

జూమ్ సమావేశంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 3 వరకు 'సర్' ప్రక్రియకే పూర్తి ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి కార్యక్రమం పురోగతిని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు.
బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏలు) పూర్తి సహకారం అందించాలని, అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ప్రక్రియల వల్ల ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల ప్రచార సమయంలో పనిచేసిన నిబద్ధతతోనే 'సర్' ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!