

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, మండోదరిగా కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘దంగల్’ ఫేమ్ సన్యా మల్హోత్రా ‘రామాయణ’లో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కథ ప్రకారం శాపం కారణంగా రాయిగా మారిన అహల్య పాత్రను ఆమె పోషించనున్నట్లు తెలుస్తోంది. శ్రీరాముడి పాదస్పర్శతో అహల్యకు శాపవిముక్తి లభించే సన్నివేశంలో సన్యా కనిపించనుందని సమాచారం. ఈ సన్నివేశం దాదాపు ఐదు నిమిషాలే ఉన్నప్పటికీ కథలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండటంతో నితీష్ తివారి ఆమెను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు టాక్. ఈ సీన్ సినిమాలో ప్రధాన హైలైట్స్‌లో ఒకటిగా నిలిచేలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!