
జనరల్

గంజాయి డాన్‌గా పేర్కొంటున్న రీతు భాయ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గంజాయి విక్రయాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గంజాయి విక్రయాల ద్వారా సంపాదించిన డబ్బును హవాలా మార్గంలో తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!