

యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ భారీ సంచలనాన్ని త్రుటిలో తప్పించుకున్నాడు. దాదాపు ఐదు గంటలపాటు సాగిన మారథాన్ తొలి రౌండ్ పోరులో ఇటలీకి చెందిన లొరెంజో సొనెగోను 6-4, 3-6, 6-7 (7-9), 7-5, 6-4తో ఓడించాడు. తొలి సెట్ గెలిచిన జ్వెరెవ్ తర్వాతి రెండు సెట్లను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు. అయితే నాలుగో సెట్‌లో కీలక సమయంలో పుంజుకుని మ్యాచ్‌ను నిర్ణాయక సెట్‌కు తీసుకెళ్లాడు. ఐదో సెట్‌లో బ్రేక్ సాధించి విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ 12 ఏస్‌లు, 61 విన్నర్లు కొట్టగా.. సొనెగో 43 అనవసర తప్పిదాలతో నష్టపోయాడు. కొబోలి, టేలర్ ఫ్రిట్జ్, ముసెట్టి, సెరుండొలో, బెలుచి, మెద్వెదెవ్ కూడా తదుపరి రౌండ్లకు చేరుకున్నారు.
మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ జెస్సికా పెగులా రెండో రౌండ్లో సోఫియా కెనిన్‌ను సులభంగా ఓడించి మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో సీడ్ ఎలెనా రిబకినా, నాలుగో సీడ్ కొకో గాఫ్, ఐదో సీడ్ మిర్రా ఆండ్రీవా కూడా ముందంజ వేశారు. మ్యాడిసన్ కీస్, బెలిండా బెన్సిచ్, ఎలిసబెట్టా కొచ్చరెట్టో, ఎలిస్ మెర్టెన్స్ తదితరులు కూడా విజయాలు అందుకున్నారు. మరోవైపు ఫ్రాన్స్ వెటరన్ గేల్ మోన్‌ఫిల్స్ తన 40వ పుట్టినరోజున ప్రత్యేక విజయాన్ని నమోదు చేశాడు. పరాగ్వేకు చెందిన డేనియల్ వలెజోపై విజయం సాధించి యూఎస్ ఓపెన్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. దీంతో 40 ఏళ్ల వయసులో యూఎస్ ఓపెన్ సింగిల్స్ మ్యాచ్ గెలిచిన జిమ్మీ కానర్స్ తర్వాతి అతి పెద్ద వయసు ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇదే తన చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ అని, ప్రస్తుత సీజన్ తర్వాత ఆటగాడిగా కొనసాగనని మోన్‌ఫిల్స్ ఇప్పటికే ప్రకటించాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!