

తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించే భక్తులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అరుణాచలం, మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం, రామేశ్వరం, శ్రీరంగం, పళని దండాయుధపాణి ఆలయం, తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వంటి ప్రముఖ ఆలయాల్లో ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఫోన్లతో ఫొటోలు, వీడియోలు, సెల్ఫీలు, రీల్స్ చేయడాన్ని కూడా నిషేధించారు.
సాధారణ భక్తులతో పాటు వీఐపీలు, సెలెబ్రిటీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. భక్తులు తమ మొబైల్ ఫోన్లను భద్రపరుచుకునేందుకు ఆలయాల ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేక లాకర్లు, మొబైల్ స్టోరేజ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో ఫోన్‌కు రూ.5 చొప్పున వసూలు చేసి డిజిటల్ రసీదు అందించనున్నట్లు తెలిపారు. నిబంధనలకు భక్తులందరూ సహకరించాలని ఆలయ కార్యనిర్వాహక అధికారులు విజ్ఞప్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!