

అమెరికాలో జన్మించిన పిల్లలకు పాస్‌పోర్టు జారీ చేసే నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను పరిమితం చేయడం, బర్త్ టూరిజాన్ని అడ్డుకోవడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ప్రస్తుతం పిల్లల పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసేటప్పుడు తల్లిదండ్రుల సంబంధాన్ని నిరూపించే పత్రాలు, ఫొటో గుర్తింపు పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది.
ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు, జనన ధృవీకరణ పత్రం, ఐ-94 ఎరైవల్ రికార్డు లేదా శాశ్వత నివాస హోదాకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి రావచ్చు. ఈ వివరాల ఆధారంగా చిన్నారికి అమెరికా పాస్‌పోర్టు పొందే అర్హత ఉందా లేదా అనేది నిర్ణయించనున్నారు. ఈ నిబంధనలకు న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, సెప్టెంబరు 5 నుంచి అమలు చేసేలా ఆదేశాలు ఉన్నాయని రాయిటర్స్ తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!