

సింగర్ బాద్‌షా, పంజాబీ నటి ఇషా రిఖి తమ వివాహ బంధాన్ని ముగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇషా రిఖి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. తాజాగా బాద్‌షా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, నెటిజన్లను కోరారు.
బాద్‌షాకు ఇది రెండో వివాహ బంధం ముగియడం కావడం గమనార్హం. ఆయన 2012లో జాస్మిన్ మసీహ్‌ను వివాహం చేసుకోగా, 2020లో ఇద్దరూ విడిపోయారు. అనంతరం 2026 మార్చిలో పంజాబీ నటి ఇషా రిఖిని వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ బంధం కూడా కొద్ది నెలల్లోనే ముగిసింది. ప్రస్తుతం బాద్‌షా భరణంగా ఇషాకు ఎన్ని కోట్లు చెల్లించారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. కానీ ఈ జంట భరణం లేదా ఆర్థిక సెటిల్‌మెంట్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అందువల్ల వైరల్ అవుతున్న మొత్తాలపై అధికారిక ధృవీకరణ లేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!