
రాజకీయాలు

తెలంగాణ రాష్ట్ర ఆయుష్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో లెక్చరర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా అవకాశం లభించనుంది. నియామక ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) చేపట్టనుంది.
ఈ పోస్టులకు నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఎంహెచ్ఎస్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!