

నాసా ప్రయోగించిన వోయేజర్-1 అంతరిక్ష నౌక భూమి నుంచి సుమారు 25.9 బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరో అరుదైన ఘనతను అందుకుంది. ఈ నౌకలోని గోల్డెన్ రికార్డులో భూమిపై ఉన్న వివిధ సంస్కృతులు, సంగీత సంప్రదాయాలకు సంబంధించిన రికార్డింగ్‌లు ఉన్నాయి. వాటిలో ప్రముఖ హిందుస్తానీ శాస్త్రీయ గాయని కేసర్‌బాయి కేర్కర్ ఆలపించిన ‘జాత్ కహా హో’ పాట కూడా ఒకటి. భూమిపై మానవ సంస్కృతుల వైవిధ్యాన్ని విశ్వానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో నాసా ఈ సంగీతాన్ని గోల్డెన్ రికార్డులో చేర్చింది.
విశేషమేమిటంటే.. వోయేజర్-1 ప్రయోగించిన 11 రోజులకే కేసర్‌బాయి కేర్కర్ కన్నుమూశారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె గాత్రం మాత్రం అంతరిక్షంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. భారతీయ శాస్త్రీయ సంగీత వైభవాన్ని చాటిచెప్పే ఈ రికార్డింగ్.. మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని భూమికి ఆవలికి తీసుకెళ్తున్న అరుదైన గుర్తింపుగా నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!