

₹45 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మండాడి’ సినిమా విషయంలో నిర్మాత ఎల్రెడ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ తొలుత ₹15 కోట్ల అవుట్‌రైట్ డీల్‌తో సొంతం చేసుకోవాలని భావించిందని సమాచారం. అయితే బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మాత ₹25 కోట్లు డిమాండ్ చేయగా, నెట్‌ఫ్లిక్స్ ఆ ప్రతిపాదనను తిరస్కరించి థియేట్రికల్ వసూళ్ల ఆధారంగా చెల్లింపులు చేసే ‘పర్ఫార్మెన్స్-బేస్డ్’ డీల్‌ను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఈ ఒప్పందం ప్రకారం సినిమా ₹50 కోట్ల నుంచి ₹80 కోట్ల వరకు వసూళ్ల మైలురాళ్లను చేరితేనే భారీ మొత్తాన్ని చెల్లించేలా నెట్‌ఫ్లిక్స్ షరతులు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఎల్రెడ్ కుమార్ మాత్రం తన ప్రాజెక్ట్‌పై నమ్మకంతో ఈ సవాలును స్వీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి రాణిస్తుండటంతో, నెట్‌ఫ్లిక్స్ నుంచి సుమారు ₹40 కోట్ల వరకు మొత్తం అందే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి థియేట్రికల్ షేర్ ద్వారా మరో ₹5 కోట్ల బడ్జెట్ రికవరీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!