

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అఖిల్ రాజ్ ఇప్పుడు ‘శనార్తి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను సంపత్ నందికి చెందిన ‘సంపత్ నంది టీమ్‌వర్క్స్’, కె.వి. శ్రీధర్ రెడ్డికి చెందిన ‘శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ‘ఆదిత్య మూవీస్’ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంతో సంపత్ నంది శిష్యుడు రాజ్ గణేష్ ఉప్పునూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. పల్లెటూరి నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కథలో ప్రధానంగా చూపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఇటీవల విడుదలైన ‘శనార్తి’ టైటిల్ పోస్టర్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పసుపు, ఎరుపు రంగులతో పాటు గాజులు, కంకణాలు ధరించిన రెండు చేతులు జోడించి ఉన్న దృశ్యం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంది. ఈ చిత్రంలో తెలంగాణ జానపద గీతాలతో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ కథానాయికగా నటిస్తున్నారు. గ్రామీణ జీవన విధానం, స్థానిక సంప్రదాయాలు, భావోద్వేగాలను కలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సంపత్ నంది మద్దతుతో కొత్త దర్శకుడు రాజ్ గణేష్ ఉప్పునూటి పరిచయం కావడం ఈ ప్రాజెక్ట్‌కు అదనపు ఆసక్తిని తెచ్చింది. ‘ఓదెల’ ఫ్రాంచైజ్ చిత్రాలతో గుర్తింపు పొందిన సంపత్ నంది నిర్మాణ సహకారం ఉండటంతో సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!