
జనరల్

వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్క కాట్ల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ప్రజల భద్రత విషయంలో అధికారులు ప్రేక్షక పాత్ర పోషించకూడదని స్పష్టం చేసింది.
ప్రమాదకరమైన, పిచ్చి కుక్కలను వీధుల్లో వదిలేయరాదని, అవసరమైతే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించినట్లు సమాచారం. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోకపోతే అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజల భద్రతే అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!