

విధులకు సుదీర్ఘకాలంగా అనధికారికంగా గైర్హాజరవుతున్న 70 మంది ప్రభుత్వ వైద్యులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో ఏడాదికి పైగా విధులకు దూరంగా ఉన్న 70 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లపై ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత నిబంధనల ప్రకారం ముందుగా సంజాయిషీ నోటీసులు జారీ చేసిన అనంతరం తొలగింపు ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇదే అంశంలో వివిధ దశల్లో ఉన్న మరో 193 మంది వైద్యులపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది మేలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 51 మంది వైద్యులను తొలగించిన విషయం తెలిసిందే. వైద్యుల గైర్హాజరును ఉపేక్షించవద్దని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. డీఎంఈ, డీఎస్‌హెచ్ అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం తాజా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!