
జనరల్

తిరుపతిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రహదారి భద్రతను పటిష్ఠం చేసేందుకు రవాణా, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. భక్తుల రాకపోకల నేపథ్యంలో వాహనాల భద్రత, నిబంధనల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. టోల్ గేట్ల వద్ద ‘స్టాప్ అండ్ వాష్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బస్సులను తనిఖీ చేస్తున్నారు. డ్రైవర్లు, వాహనాల భద్రతా ప్రమాణాలు, అవసరమైన పత్రాలను పరిశీలిస్తున్నారు.
గత పది రోజుల్లో 61 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను తనిఖీ చేసినట్లు జిల్లా రవాణా అధికారి మురళీ మోహన్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల నుంచి రూ.6 లక్షల జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో రహదారి భద్రతకు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!