

బిగ్‌బాస్ తెలుగు 10 రెండో వారం తొమ్మిదో రోజు ఎపిసోడ్ వినోదం, వాగ్వాదాలు, భావోద్వేగాలతో సాగింది. ముఖ్యంగా దేబ్జానీ మరోసారి ఎపిసోడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘డార్లింగ్’ అనే పదంపై జరిగిన చర్చలో ఆమె చేసిన కామెంట్స్, ఫన్నీ టైమింగ్ ప్రేక్షకులను అలరించాయి. అనంతరం స్విమ్మింగ్ పూల్ వద్ద ముఖేష్ గౌడ, వర్షిణి కలిసి స్విమ్ చేయడాన్ని చూసిన దేబ్జానీ.. ముఖేష్‌పై సరదాగా ఫైర్ అయింది. తనకు ముఖేష్ అంటే ఇష్టమని ఇప్పటికే చెప్పానని, అయినా తనను పట్టించుకోకుండా వర్షిణితో కలిసి స్విమ్ చేశాడంటూ ‘మోసం చేశావు’ అని రచ్చ చేసింది. రామ్ ప్రసాద్ కూడా ఆమెకు మద్దతుగా నిలవడంతో ఈ సన్నివేశం మరింత కామెడీగా మారింది.
మరోవైపు త్రిగుణ్, సుధీర్ మధ్య విభేదాలు కూడా ఎపిసోడ్‌లో హైలైట్ అయ్యాయి. టిష్యూస్ పడేయడం, షాలినికి సపోర్ట్ చేయడం వంటి విషయాలపై త్రిగుణ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే తర్వాత ఇద్దరూ మాట్లాడుకుని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కెప్టెన్సీ కంటెండర్ల ఎంపికలో ప్రేక్షకుల నిర్ణయానికి అవకాశం ఇవ్వడంతో దేబ్జానీ, త్రిగుణ్, అమన్, షాలిని, ముఖేష్ గౌడ, రోహిత్, ఝాన్సీ, రామ్ ప్రసాద్ పోటీలోకి వచ్చారు. గజిబిజిగా ఉన్న అక్షరాలను సరిచేసి పదాన్ని గుర్తించే టాస్క్‌లో త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, రోహిత్ వివిధ దశల్లో తప్పుకున్నారు. దీంతో ఝాన్సీ, షాలిని, అమన్, ముఖేష్ గౌడ మధ్య పోటీ కొనసాగింది. దేబ్జానీకి తెలుగు సరిగ్గా రాదనే కారణంతో కొందరు ఆమెను తొలగించాలని చెప్పినా, పలువురు కంటెస్టెంట్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. తనకు లభించిన మద్దతును చూసి దేబ్జానీ సంతోషం వ్యక్తం చేసింది. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో దేబ్జానీ చుట్టూ జరిగిన సరదా సన్నివేశాలు, కెప్టెన్సీ టాస్క్‌లోని పరిణామాలు ప్రత్యేకంగా నిలిచాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!