5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సొరంగం పనుల్లో కీలక దశకు చేరుకున్న ఎస్‌ఎల్‌బీసీ - మంత్రి ఉత్తమ్‌ కుమార్‌

Writer: Pooja 05:57 AM, 5 అక్టోబర్, 2026
సొరంగం పనుల్లో కీలక దశకు చేరుకున్న ఎస్‌ఎల్‌బీసీ - మంత్రి ఉత్తమ్‌ కుమార్‌

అత్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థితులను అధిగమించి శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో కీలక పురోగతి సాధించామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. గతంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలోని బలహీన శిలల మండలం (షియర్‌ జోన్‌)ను దాటడంతో పనులను మరింత వేగంగా చేపట్టేందుకు మార్గం సుగమమైందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కీలక నీటిపారుదల ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా మెట్ట ప్రాంతాలకు 30 టీఎంసీలకు పైగా నీటిని అందించేందుకు 2028 జూన్‌ నాటికి లక్ష్యాన్ని చేరుకునేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పనుల వేగంతో పాటు కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

గత ఐదారు నెలల్లో సొరంగం తవ్వకాలు అవుట్‌లెట్‌ వైపు సుమారు 450 మీటర్లు, ఇన్‌లెట్‌ వైపు 250 మీటర్లు కలిపి మొత్తం 700 మీటర్లు ముందుకు సాగినట్లు ప్రాజెక్టు బృందం తెలిపింది. మొత్తం 43.968 కిలోమీటర్ల ప్రధాన సొరంగంలో సుమారు 79 శాతం పనులు పూర్తయ్యాయని, మరో 9.1 కిలోమీటర్ల మేర తవ్వకాలు మిగిలి ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం రెండు వైపులా కలిపి రోజుకు సుమారు ఎనిమిది మీటర్ల పురోగతి నమోదవుతోందని పేర్కొంది. అదనపు డ్రిల్లింగ్‌ యంత్రాలు, జర్మనీ నుంచి రానున్న లోకోమోటివ్‌తో తవ్విన రాళ్లు, మట్టిని వేగంగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. సుమారు 7.1 కిలోమీటర్ల టన్నెల్‌-2లో లైనింగ్‌ పనులు కూడా తిరిగి ప్రారంభమైనట్లు అధికారులు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌

ట్యాగ్లు
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంశ్రీశైలం ఎడమగట్టు కాలువఉత్తమ్ కుమార్ రెడ్డితెలంగాణ నీటిపారుదలసొరంగం పనులునీటిపారుదల ప్రాజెక్టులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?
సినిమాలు

ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా
జనరల్

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు
బిజినెస్

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు
బిజినెస్

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత
బిజినెస్

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి
జనరల్

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు
క్రీడలు

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
జనరల్

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర
జనరల్

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ
జనరల్

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

ఆసియా క్రీడలులో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు
క్రీడలు

ఆసియా క్రీడలులో భారత్‌ ప్రదర్శన.. పురోగతితో పాటు బయటపడ్డ లోపాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!