
జనరల్

జూనియర్ ఎన్టీఆర్ తన ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. తన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తనకు వైద్యం అందించిన కిమ్స్ వైద్య బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉన్న అభిమానులకు ఈ వార్త ఊరటనిచ్చింది.
తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, అభిమానానికి జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ఆశీస్సులు, మద్దతు తనకు ఎంతో బలాన్ని ఇస్తాయని పేర్కొంటూ.. త్వరలోనే వారిని కలుస్తానని చెప్పారు. ఎన్టీఆర్ తాజా అప్‌డేట్‌తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!