

హైదరాబాద్ నగరవ్యాప్తంగా జరిగిన ఆషాఢ బోనాల ఉత్సవాల్లో మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలోని షీ టీమ్స్ విస్తృత నిఘా చేపట్టాయి. ఆలయాలు, ఊరేగింపు మార్గాలు, బస్‌స్టాప్‌లు, మెట్రో స్టేషన్లు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో సాదాసీదా దుస్తుల్లో సిబ్బందిని మోహరించారు. వీడియోగ్రాఫిక్ నిఘాతో అల్లరి మూకలు, వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించారు. ఉత్సవాల సందర్భంగా అందిన 122 ఫిర్యాదుల ఆధారంగా మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, వేధింపులు, ఈవ్‌టీజింగ్, స్టాకింగ్‌కు పాల్పడిన 678 మందిని ఆధారాలతో పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS), హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. సమర్థవంతమైన విచారణ, సత్వర న్యాయ ప్రక్రియతో 25 మందికి కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ డాక్టర్ లావణ్య తెలిపారు. మరో 26 మందికి రూ.1,050 జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని కోర్టు ఆదేశించింది. మహిళా భద్రత, సైబర్ క్రైమ్, అత్యవసర హెల్ప్లైన్లపై 400కు పైగా అవగాహన కార్యక్రమాలు, 110కు పైగా పర్యవేక్షణ చర్యలను షీ టీమ్స్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!