

ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ప్రత్యేక పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ పాలసీలను అధ్యయనం చేసిన ప్రభుత్వం.. ఐదు రాష్ట్రాల విధానాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన పారితోషికం, ప్రచార కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం వంటి అంశాలపై ఏపీ ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.
ఇన్ఫ్లుయెన్సర్లను వారి సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజించే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల విధానాల్లోనూ ఫాలోవర్లు, వ్యూస్ వంటి ప్రమాణాల ఆధారంగా కేటగిరీలు, చెల్లింపులను నిర్ణయించే విధానాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం రూపొందించనున్న తుది మార్గదర్శకాల్లో ఇన్ఫ్లుయెన్సర్ల అర్హతలు, కేటగిరీలు, పారితోషికం తదితర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!