

2016 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ అదృశ్యం కావడం కర్ణాటకలో కలకలం రేపుతోంది. పరిశ్రమలు, వాణిజ్య శాఖలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన ఆగస్టు 20 నుంచి కుటుంబ సభ్యులు, సహచరులకు అందుబాటులో లేరని సమాచారం. ఢిల్లీ వెళ్లేందుకు ఆయన విమాన టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన చివరిసారిగా కనిపించినట్లు ప్రాథమిక సమాచారం.
ఈ ఘటనపై మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ, గంగ్వార్‌తో అన్ని రకాల కమ్యూనికేషన్లు నిలిచిపోయినట్లు తెలిపారు. విమానాశ్రయం నుంచి లభించిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు అధికారిక పోలీసు ఫిర్యాదు అందలేదని సమాచారం. గతంలో గంగ్వార్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పరీక్షల కంట్రోలర్‌గా పనిచేశారు. ఆయన అదృశ్యానికి కేపీఎస్సీలో పనిచేసిన సమయంలో జరిగిన పరిణామాలు కారణమని కొన్ని కథనాలు పేర్కొంటున్నప్పటికీ, అధికారులు దీనిని ఇంకా ధ్రువీకరించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!