
షోస్

మెహదీపట్నం సర్కిల్-33లో విధులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. భవన నిర్మాణ పనులను నిలిపివేయకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా మొదటి విడతగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి ఆమెను పట్టుకున్నారు.
సునీత వద్ద నుంచి లంచంగా తీసుకున్న రూ.4 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమె వద్ద ఉన్న రూ.2.5 లక్షల అదనపు నగదును కూడా అక్రమంగా సంపాదించిన సొమ్ముగా గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితురాలిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!