

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తదుపరి చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా ఉన్న ఆయన ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. అమర్‌ప్రీత్ సింగ్ అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనుండగా, అదే రోజు మధ్యాహ్నం అశుతోష్ దీక్షిత్ ఎయిర్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
1986లో ఫైటర్ స్ట్రీమ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన అశుతోష్ దీక్షిత్‌కు దాదాపు నాలుగు దశాబ్దాల సేవా అనుభవం ఉంది. ఆయన ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా 3,500 గంటలకు పైగా విమానయాన అనుభవం కలిగి ఉన్నారు. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వంటి కీలక బాధ్యతలను ఆయన నిర్వహించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!