4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ల దాడి

Writer: Harika S 03:41 PM, 4 అక్టోబర్, 2026
ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ల దాడి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న వేళ, ఉక్రెయిన్‌లోని భారతీయ ఫార్మా కంపెనీపై భీకర దాడి జరిగింది. రష్యా ప్రయోగించిన డ్రోన్లు సుమీ నగరంలోని 'కుసుమ్ గ్రూప్'కు చెందిన ఫార్మా ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెంద‌గా, పలువురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో ప్లాంట్‌లోని ప్రధాన నిర్మాణం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. డ్రోన్లు దాడి చేసిన ప్రాంతం నుంచి భారీగా పొగ కమ్ముకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ దాడి వల్ల సుమారు రూ.400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

రెండేళ్లకు పైగా యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఈ ప్లాంట్ నిరంతరాయంగా ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంది. తాజా దాడితో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.భారతీయుడైన రాజీవ్ గుప్తా నేతృత్వంలో కుసుమ్ గ్రూప్ నడుస్తోంది. ఈ సంస్థ 1994లో భారతీయ ఔషధాలను ఉక్రెయిన్‌కు ఎగుమతి చేసే డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభమై, ఆ తర్వాత సొంత బ్రాండ్లను మార్కెటింగ్ చేసింది. 2009లో సుమీ నగరంలో తయారీ ప్లాంట్‌ను స్థాపించింది. ఈ గ్రూప్ ఉక్రెయిన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ వంటి 9కి పైగా దేశాలకు 50 రకాల జనరిక్ ఔషధాలను విక్రయిస్తోంది.

గత కొంతకాలంగా రష్యా.. చవకైన, వేగవంతమైన షాహెద్ డ్రోన్లతో ఉక్రెయిన్‌పై నిరంతరం దాడులు చేస్తోంది. ఈ డ్రోన్లను అడ్డుకోవడం ఉక్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారింది. ఇదే సమయంలో, ఉక్రెయిన్ కూడా దేశీయంగా తయారుచేసిన 'ఎఫ్‌పీ-7' బాలిస్టిక్ క్షిపణిని ఈ వారంలో తొలిసారిగా ప్రయోగించినట్లు ప్రకటించింది. దీని పరిధి సుమారు 250 కిలోమీటర్లు కావడం గమనార్హం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిహార్ వరద బాధితులకు సహాయం. వ్యక్తి మృతి

బిహార్ వరద బాధితులకు సహాయం. వ్యక్తి మృతి

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు:  భారత్ హై కమిషనర్ త్రివేది

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు: భారత్ హై కమిషనర్ త్రివేది

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు

సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు

ట్యాగ్లు
రష్యాభారతీయ_ఫార్మాసుమీ దాడిఉక్రెయిన్ఫార్మాఅంతర్జాతీయవార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సింగీతం శ్రీనివాసరావుకు రాజమౌళి, చిరంజీవి నివాళులు
సినిమాలు

సింగీతం శ్రీనివాసరావుకు రాజమౌళి, చిరంజీవి నివాళులు

యాప్‌ స్టోర్‌ నుంచి బిట్‌చాట్‌ తొలగింపు
టెక్నాలజీ

యాప్‌ స్టోర్‌ నుంచి బిట్‌చాట్‌ తొలగింపు

బిహార్‌లో విషాదం.. హెలికాప్టర్ నుంచి పడిన ఆహార ప్యాకెట్ తగిలి వ్యక్తి మృతి
జనరల్

బిహార్‌లో విషాదం.. హెలికాప్టర్ నుంచి పడిన ఆహార ప్యాకెట్ తగిలి వ్యక్తి మృతి

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ అమ్మకాల్లో రికార్డు – ఆనంద్ మహీంద్రా
బిజినెస్

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ అమ్మకాల్లో రికార్డు – ఆనంద్ మహీంద్రా

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

శర్వానంద్, సంపత్ నంది  ‘భోగి’ టీజర్ విడుదల
సినిమాలు

శర్వానంద్, సంపత్ నంది ‘భోగి’ టీజర్ విడుదల

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ల దాడి
జనరల్

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ల దాడి

రాయ్ బరేలీ నుంచి పోటీచేయడానికి  రాహుల్ గాంధీ భయపడ్డారు – సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివ్ పాల్ సింగ్
రాజకీయాలు

రాయ్ బరేలీ నుంచి పోటీచేయడానికి రాహుల్ గాంధీ భయపడ్డారు – సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివ్ పాల్ సింగ్

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు:  భారత్ హై కమిషనర్ త్రివేది
జనరల్

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు: భారత్ హై కమిషనర్ త్రివేది

బాలయ్య-కొరటాల సినిమాపై క్రేజీ బజ్.. విలన్‌గా ఆ సీనియర్ హీరో?
గాసిప్స్

బాలయ్య-కొరటాల సినిమాపై క్రేజీ బజ్.. విలన్‌గా ఆ సీనియర్ హీరో?

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!
ఆరోగ్యం

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
జనరల్

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!