
సినిమాలు

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు శుక్రవారం ఎల్‌బీనగర్‌లోని బైరమల్‌గూడ శ్రీ హనుమాన్ గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైందవ ధర్మం, భారతీయ సంస్కృతిలో గోమాతకు అత్యున్నత స్థానం ఉందని తెలిపారు. పాలు, పాడి ఉత్పత్తులు, సహజ ఎరువుల ద్వారా మానవాళికి సేవలందించే గోమాతను రక్షించడం, పూజించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో కొందరు గోవులను అవమానిస్తూ, గోహత్యలను ప్రోత్సహించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గోవధ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, గోరక్షణలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!