

తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. హైదరాబాద్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.
మరోవైపు ఎల్లుండి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, రేపు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు కూడా హెచ్చరికలు విస్తరించనున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!