

2026లో నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఇది గుర్తింపుగా నిలిచిందన్నారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది యువ క్రీడాకారులు తెలంగాణకు రానున్నారని మంత్రి తెలిపారు. ఈ క్రీడా మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశంతో తెలంగాణలో క్రీడా సంస్కృతి మరింత బలోపేతం కావడంతో పాటు యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!