

ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో నిర్వహించే ఉత్సవాలు, కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. బల్కంపేటలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పోలీసు శాఖ, జీహెచ్‌ఎంసీ, టీజీఎస్‌పీడీసీఎల్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌బీ, వైద్యారోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, టీజీఎస్‌ఆర్టీసీ, ఆర్ అండ్ బీ, ట్రాఫిక్ పోలీసులు, సాంస్కృతిక శాఖ, ఐ అండ్ పీఆర్ తదితర అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.
ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శిస్తే అష్టాదశ శక్తిపీఠాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందనే విశ్వాసం భక్తుల్లో ఉందని మంత్రి పేర్కొన్నారు. జూలై 21, 22, 23 తేదీల్లో జరిగే కళ్యాణోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, వైద్య సేవలు వంటి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని క్షేమంగా తిరిగి వెళ్లేలా అన్ని శాఖలు కృషి చేయాలని ఆమె స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!