
జనరల్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ దర్శకుడు సముద్రకని, మెహర్ రమేష్, బన్నీ వాసు, శ్యామల దేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సముద్రకని కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని తనకు విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు.
తమిళగ వెట్రి కళగం పార్టీకి ప్రజాభిమానం పెరుగుతోందని సముద్రకని అన్నారు. భవిష్యత్తులో విజయ్ ఎదుర్కొనే సవాళ్లను అధిగమించాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలుగులో 'జై హనుమాన్' సినిమాలో నటిస్తున్నానని, తమిళంలో మరిన్ని చిత్రాల్లో భాగమవుతున్నానని చెప్పారు. తన దర్శకత్వంలో రూపొందిన “స్కూల్ బస్సు” సినిమా విడుదలకు సిద్ధమైందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!