
రాజకీయాలు

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) దేశవ్యాప్తంగా ‘ప్రజల మాట విందాం యాత్ర’కు సిద్ధమవుతోంది. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 36 రోజుల ఆందోళన అనంతరం విద్య, ప్రజా సమస్యలపై ఈ కొత్త ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. దీనిని ‘జంతర్ మంతర్ సీజన్ 2’గా అభివర్ణించారు.
బుధవారం దిల్లీలో జరగాల్సిన సీజేపీ వాలంటీర్ల సమావేశం చివరి నిమిషంలో రద్దు కావడంపై దీప్కే స్పందించారు. బీజేపీ ఒత్తిడితోనే సమావేశ మందిరం బుకింగ్‌ను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా, నకిలీ న్యాయవాదులు, బూటకపు న్యాయ పట్టాలు, సీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తుల కార్యకలాపాలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం, సీబీఐ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందనను సుప్రీంకోర్టు కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!