

కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం–2026’ కార్యక్రమం కీలక మైలురాయిని అధిగమించింది. కేవలం 17 రోజుల్లోనే తెదేపా శ్రేణులు 50.62 లక్షల ఇళ్లను సందర్శించినట్లు పార్టీ ప్రకటించింది. 50 లక్షల ఇళ్ల సందర్శన మైలురాయిని చేరుకోవడంపై తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేసి, పార్టీ శ్రేణులను అభినందించారు.
మరోవైపు 25 వేల కంటే తక్కువ ఇళ్ల సందర్శనలు నమోదైన నియోజకవర్గాలు, 4,220 బూత్‌లపై నారా లోకేశ్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 17వ రోజు 3.12 లక్షల ఇళ్లను టీడీపీ కార్యకర్తలు సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!